కొత్త మునిసిపాలిటీల్లో కొత్త బార్లు | New bars in new municipalities | Sakshi
Sakshi News home page

కొత్త మునిసిపాలిటీల్లో కొత్త బార్లు

Jun 29 2014 1:19 AM | Updated on Sep 2 2017 9:31 AM

కొత్త మునిసిపాలిటీల్లో కొత్త బార్లు

కొత్త మునిసిపాలిటీల్లో కొత్త బార్లు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న బార్ల సంఖ్యను స్వల్పంగా పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గ్రామ పంచాయతీల నుంచి మునిసిపాలిటీలుగా మారిన కొత్త పట్టణాల్లో బార్ల ఏర్పాటు కు లెసైన్స్‌లు జారీ చేస్తారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న బార్ల సం ఖ్యను స్వల్పంగా పెంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గ్రామ పంచాయతీల నుంచి మునిసిపాలిటీలుగా మారిన కొత్త పట్టణాల్లో బార్ల ఏర్పాటు కు లెసైన్స్‌లు జారీ చేస్తారు. జూలై 1 నుంచి మొదలు కాబోతున్న 2014- 15 ఎక్సైజ్ పాలసీని శనివారం ప్రభుత్వం ప్రకటించింది. జూలై ఒకటి నుంచి ప్రస్తు త బార్లను రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.ఆర్. మీనా జీవోలు జారీ చేశారు. కాగా,బార్ల లెసైన్స్ ఫీజుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. జనాభా ప్రాతిపదికన నాలుగు స్లాబుల్లో ఈ ఫీజులు ఉంటాయి. అయితే ప్రివిలేజ్ ఫీజు 5 రెట్లకు కుదించారు. అంటే లెసైన్స్ ఫీజు కన్నా ఐదు రెట్ల అమ్మకాలు దాటితే, తరువాత కొనుగోలు చేసే బాటిళ్లపై ఎక్సైజ్ శాఖ 14.5 శాతం ఫీజు వసూలు చేస్తుంది.


పెరగనున్న బార్లు: తెలంగాణలోని 10 జిల్లాల్లో బార్ లెసైన్స్‌లు 726 ఉన్నప్పటికీ ప్రస్తుతం 704 మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పటివరకు బార్లులేని కొత్త మునిసిపాలిటీల్లో వాటిని ఏర్పాటుకు ఎక్సైజ్ కమిషనర్ అనుమతిస్తారు. రాష్ట్రంలో మొత్తం 38 మునిసిపాలిటీలు ఉండగా వీటిలో 8 కొత్తవే. బార్ల లెసైన్స్ ఫీజు ద్వారా రూ. 200 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.   కాగా ప్రివిలేజ్ ఫీజును 5 రెట్లకు తగ్గించడం వల్ల ఒక్కో బార్ నుంచి కనీసం రూ. 5లక్షల వరకు సర్కార్‌కు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement