నయీం అక్రమాలపై విచారణ జరపాలి: చాడ | Nayim Conduct an investigation into Irregularities Says chada venkat reddy | Sakshi
Sakshi News home page

నయీం అక్రమాలపై విచారణ జరపాలి: చాడ

Apr 20 2019 5:30 AM | Updated on Apr 20 2019 5:30 AM

Nayim Conduct an investigation into Irregularities Says chada venkat reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నయీం గ్యాంగ్‌ చేసిన హత్యలు, ఆస్తుల ఆక్రమణలపై హైకోర్టు ఆధ్వర్యంలో న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. కబ్జాలతో ఆస్తులు, భూములు కోల్పోయిన వారికి విచారణ ద్వారా న్యాయం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో చాడ విలేకరులతో మాట్లాడారు. నయీం డైరీలో నేరాల చిట్టా మొత్తం ఉందని చెబుతున్నా, ఇంత వరకు డైరీని ఎందుకు బహిరంగ పర్చలేదని ప్రశ్నించారు. ఇటీవల అకాల వర్షాలు, పిడుగు లు, కరువుతో రైతులపై ముప్పేట దాడి జరుగు తున్నందున, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement