పెద్దషాపూర్ బాలికకు 'నాసా' ఆహ్వానం | NASA Invites ankathi paavani for isdc | Sakshi
Sakshi News home page

పెద్దషాపూర్ బాలికకు 'నాసా' ఆహ్వానం

May 19 2015 7:14 AM | Updated on Sep 3 2017 2:19 AM

కెనడాలో ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగే ఇంటర్నేషనల్ స్పేస్ డెవెలప్‌మెంట్ కాన్ఫరెన్స్(ఐఎస్‌డీసీ)కి మండలంలోని పెద్దషాపూర్ బాలిక, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అంకతి పావనికి 'నాసా' నుంచి ఆహ్వనం అందుకుంది.

శంషాబాద్ రూరల్: కెనడాలో ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగే ఇంటర్నేషనల్ స్పేస్ డెవెలప్‌మెంట్ కాన్ఫరెన్స్(ఐఎస్‌డీసీ)కి మండలంలోని పెద్దషాపూర్ బాలిక, బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అంకతి పావనికి 'నాసా' నుంచి ఆహ్వనం అందుకుంది. ట్రిపుల్ ఐటీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుకున్న పావని, వారి బందం సభ్యులతో పాటు కెనడా పర్యటనకు అయ్యే ఖర్చు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనుంది. ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తూ చెక్కులు జారీ అయ్యాయి. స్థానికంగా ఆర్‌ఎంపీ డాక్టర్ శ్రీనివాస్, కల్యాణి దంపతుల కూతురు అయిన పావని 7వ తరగతి వరకు శంషాబాద్‌లోని ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుకుంది. గచ్చిబౌలిలోని జవ హర్ నవోదయ పాఠశాలలో పదో తరతగి పూర్తి చే సుకున్న ఆమె మెరిట్ మార్కుల ఆధారంగా 2013లో బాసర్ ట్రిపుల్ ఐటీలో చేరింది. నాసా ఆహ్వానం మేరకు అంకిత కెనడా వెళ్లనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement