హైదారాబాద్‌ బస్సు సర్వీసులపై అభ్యంతరం

Narayan Khed Depot Officers Blocking Banswada Bus Services - Sakshi

అడ్డుకున్న నారాయణఖేడ్‌ ఆర్టీసీ అధికారులు

పట్టించుకోని ఆర్టీసీ ఉన్నతాధికారులు

నిజాంసాగర్‌(జుక్కల్‌): సంగారెడ్డి, పటాన్‌ చెరు మీదుగా హైద్రాబాద్‌ వెళ్తున్న బాన్సువాడ ఆర్టీసీ బస్సు సర్వీసులపై నారాయణఖేడ్‌ ఆర్టీసీ డిపో అధికారులు అభ్యంతరం తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా నిజాంపేట బస్టాండ్‌ వద్ద బాన్సువాడ నుంచి హైద్రాబాద్‌ వెళ్తున్న బస్సులను నారాయణఖేడ్‌ డిపో అధికారులు అడ్డుకున్నారు. బిచ్కుంద, పిట్లం మీదుగా హైద్రాబాద్‌కు బాన్సువాడ డిపో నుంచి ఆరు అదనపు బస్సులు నడుపుతూ నారాయఖేడ్‌, సంగారెడ్డి, హైద్రాబాద్‌ ఆర్టీసీ డిపోల ఆదాయానికి గండి కొడుతున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్‌ మీదుగా వెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దు చేసి, సంగారెడ్డి, పటాన్‌ చెరు మీదుగా బస్సు సర్వీసులను ప్రారంభించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల ఆర్టీసీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాన్సువాడ నుంచి బస్సు సర్వీసులను నడపడం వల్ల తమ బస్సులకు ఆదాయం తగ్గుతోందని, నష్టాలకు గురికావాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు. దీంతో బాన్సువాడ డిపోకు చెందిన  ఆర్టీసీ బస్సులను నిజాంపేటలో నిలిపి, ప్రయాణికులను ఇతర డిపోల బస్సుల్లో హైద్రాబాద్‌కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సు సర్వీసులను రద్దు చేసుకొవాలని బాన్సువాడ ఆర్టీసీ అధికారులకు వారు సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top