ఘనంగా నిత్యాన్వేషణం పుస్తకావిష్కరణ.. | Nandini Sidda Reddy Release Nityanveshnam Book | Sakshi
Sakshi News home page

Nov 13 2018 9:37 PM | Updated on Nov 13 2018 9:37 PM

Nandini Sidda Reddy Release Nityanveshnam Book - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆచార్య వెలుదండ నిత్యానందరావు రచించిన ‘నిత్యాన్వేషణం’ (సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం) గ్రంథ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది. రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం సాయంత్రం డాక్టర్‌ కేవీ రమణ సభాధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ‘నిత్యాన్వేషణం’  గ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి ఆవిష్కరించారు.

భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘మూసీ’ సాహిత్య ధ్వార ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్‌ మామిడి హరికృష్ణ, ఆచార్య డీ రవీందర్‌, ఆచార్య డీ సూర్యా ధనుంజయ్‌ విశిష్ట ఆతిథులుగా హాజరయ్యారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు లక్కరాజు రవీందర్ కృతిని స్వీకరించారు. వక్తలు మాట్లాడుతూ నిత్యాన్వేషణ సాగిస్తూ  తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేలా అద్భుతమైన సాహిత్య వ్యాసాలను నిత్యానందరావు వెలువరించారని, ఆయన నిరంతర సాహిత్య కృషికి, పరిశీలనా, అనుశీలనా దృష్టికి ‘నిత్యాన్వేషణం’ గ్రంథం నిదర్శనమని కొనియాడారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement