
విజయనగర్‌కాలనీ(హైదరాబాద్): పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఇండియన్ ఆర్మీ అధికారి కల్నల్ దీప్‌జ్యోతి సకై, రవీంద్రభారతి విద్యాసంస్థల డీన్ ప్రియామనీష్ అన్నారు. విజయనగర్‌కాలనీ రవీంద్రభారతి పాఠశాలలో విద్యార్థి నాయకులను ఎంపిక చేసి ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కల్నల్ దీప్‌జ్యోతి సకై పాకిస్థాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విషయాలను విద్యార్థులకు వివరించారు. అలాగే ఎస్‌పీఎల్‌గా ఎంపికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఠాకూర్ సరిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
టోలిచౌకీ రవీంద్రభారతీ పాఠశాలలో..
గోల్కొండ: టోలిచౌకీ రవీంద్రభారతీ పాఠశాలలో విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నగర క్రైం బ్రాంచ్ ఏసీపీ కె.ఎం.కిరణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యనభ్యసించి కుటుంబానికే కాకుండా దేశానికి గర్వకారణంగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయశ్రీ, డీన్ ప్రియామనీశ్ , ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.