'చంద్రబాబు సీఎం కావడంలో ఆయనదే కీలకపాత్ర' | my husband play key role for chandrababu become a CM | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు సీఎం కావడంలో ఆయనదే కీలకపాత్ర'

May 17 2015 4:38 PM | Updated on Sep 3 2017 2:14 AM

'చంద్రబాబు సీఎం కావడంలో ఆయనదే కీలకపాత్ర'

'చంద్రబాబు సీఎం కావడంలో ఆయనదే కీలకపాత్ర'

చంద్రబాబునాయుడుకు అండగా నిలిచి ఆయన ముఖ్యమంత్రి కావడంలో దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కీలకపాత్ర పోషించారని మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి అన్నారు.

నల్లగొండ రూరల్: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చిన సమయంలో చంద్రబాబునాయుడుకు అండగా నిలిచి ఆయన ముఖ్యమంత్రి కావడంలో దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి కీలకపాత్ర పోషించారని మాధవరెడ్డి సతీమణి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఉమా మాధవరెడ్డి అన్నారు.

నల్లగొండలో నిర్వహించిన జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తమ కుటుంబం మొదటి నుంచీ చంద్రబాబుకు అండగా ఉందన్నారు. మాధవరెడ్డి సహకారంతోనే చంద్రబాబు సీఎం అయ్యారని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తమ కుటుంబం కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు పని చేసిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement