ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో సంకా సత్యనారాయణ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది.
ఖమ్మం (అశ్వారావుపేట) : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో సంకా సత్యనారాయణ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. సత్యనారాయణపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వేట కొడవలితో దాడిచేశారు.
ఈ ఘటనలో సత్యనారాయణ చెవికి, చేతికి తీవ్రగాయాలయ్యాయి. సత్యనారాయణను సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.