గులాబీ తీర్థం.. | municipal councilor including chairperson joined in trs party | Sakshi
Sakshi News home page

గులాబీ తీర్థం..

Jul 21 2014 3:14 AM | Updated on Aug 15 2018 9:20 PM

కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత సహా 12 మంది కౌన్సిలర్లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

 కొత్తగూడెం:  కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత సహా 12 మంది కౌన్సిలర్లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఆధ్వర్యంలో వీరిని రాష్ట్ర నీటి పారుదల, గనుల శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కేసీఆర్ నివాస గృహంలో ఆదివారం ఈ చేర్పింపుల కార్యక్రమంగా జరిగింది. పార్టీలో చేరిన వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పారు. వీరిలో ఎక్కుమంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో చైర్‌పర్సన్ పులి గీతతో పాటు కౌన్సిలర్లు  కోలాపురి ధర్మరాజు, గోబ్రియానాయక్, పల్లపు రాజు, మామిడి శ్రీనివాస్, కనుకుంట్ల పార్వతి, సబిత, గుమ్మడెల్లి పుష్పలత, పద్మావతి, స్వతంత్ర కౌన్సిలర్ షేక్ సుల్తాన ఉన్నారు. సీపీఐకి చెందిన వై.శ్రీను, కనుకుంట్ల కుమార్‌లు సాధారణ ఎన్నికల సమయంలోనే టీఆర్‌ఎస్‌లో చేరారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 33 వార్డులకు టీఆర్‌ఎస్ బలం 14కి చేరింది. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కౌన్సిలర్ మోరె భాస్కర్, నాయకులు పులి రాజశేఖర్, తీగల వెంకన్న, రమేష్, గుమ్మడెల్లి రమణ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement