ఎంఐఎం నేతను ఉరి తీయాలి | MRPS Leader Demands To Hang MIM Leader In Hyderabad | Sakshi
Sakshi News home page

ఎంఐఎం నేతను ఉరి తీయాలి

May 9 2020 8:38 AM | Updated on May 9 2020 8:40 AM

MRPS Leader Demands To Hang MIM Leader In Hyderabad  - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్ ‌: హైదరాబాద్‌ పాత బస్తీలోని చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన  ఎంఐఎం నాయకుడు షకీల్‌ను ఉరి తీయాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడు మొండయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని అంకుసాపూర్‌లో ఆయన మాట్లాడారు. మలక్‌పేట ఎమ్మెల్యే హైమద్‌ అనుచరుడు షకీల్‌ పథకం ప్రకారమే అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. బాలిక కుటుంబానికి ప్రాణ భయం ఉందన్నారు. బాధితురాలికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. పోలీసులు అతడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు నా గోశ శంకర్, రేగుంట సాగర్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement