పాముకాటుతో తల్లీకూతురు మృతి | mother, aughter died due to snakebite | Sakshi
Sakshi News home page

పాముకాటుతో తల్లీకూతురు మృతి

Oct 12 2015 9:19 AM | Updated on Oct 22 2018 2:22 PM

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బిజిలీపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తల్లీకూతురిని పాము కాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు.

అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం బిజిలీపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన తల్లీకూతురిని పాము కాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. సోమవారం వేకువజామున ఇంట్లో నిద్రపోతున్న వినోద(28), ఆమె కుమార్తె అఖిల(9)ను నాగుపాము కాటువేసింది. పాము కాటుకు కేకలు విని నిద్రలేచిన కుటుంబసభ్యులు పాము చంపేసి, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లే లోపల మృతి చెందారు.

గత ఏడాది ఇదే రోజు వినోద భర్త రైతు శివశంకర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది తర్వాత భార్య, బిడ్డ కూడా పాముకాటుకు మృతిచెందడం గ్రామస్తులను కలచివేసింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement