టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక | Most people's involvement in TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

Apr 2 2016 12:42 AM | Updated on Sep 3 2017 9:01 PM

మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన 100మంది ఆ గ్రామ సర్పంచ్ కశిరబోయి మంజు విజయ్ యాదవ్ ...

నెల్లికుదురు : మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన 100మంది ఆ గ్రామ సర్పంచ్ కశిరబోయి మంజు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ నివాసంలో శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.


పార్టీలో చేరిన వారు యాదవసంఘం గ్రామ పెద్ద గొల్ల ఉడుత కొమురుమల్లు, నాయిని కొమురయ్య, మల్లయ్య, భూక్య రాములు, చెడుపాక యాకయ్య, వై.శ్రీను, యాకయ్య, అయిలయ్య, చంద్రయ్య, కట్టయ్య, సాయిలు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధికార ప్రతినిధి గొట్టిముక్కుల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు బైరు బాలయ్య, బొడపెల్లి కొండయ్య, పోలోజు వ్యాకర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement