నిరుద్యోగుల పక్షానే ఎమ్మెల్యే మాట్లాడారు | MLA Talked about Unemployment | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల పక్షానే ఎమ్మెల్యే మాట్లాడారు

May 9 2016 1:47 AM | Updated on Sep 3 2017 11:41 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మాట్లాడారే తప్ప ఆయన సొంత పనుల కోసం కాదని సూర్యాపేటకు చెందిన మాతృశ్రీ కళాశాల

సూర్యాపేట మాతృశ్రీ కళాశాల నిర్వాహకులు వెల్లడి

 నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మాట్లాడారే తప్ప ఆయన సొంత పనుల కోసం కాదని సూర్యాపేటకు చెందిన మాతృశ్రీ కళాశాల నిర్వాహకులు ఆర్.సత్యనారాయణ, పి.రంజిత్, పి.అశ్వినికుమార్, జె.నాగరాజు, ఎండీ జానీపాషా చెప్పారు. వారు ఆదివారం నకిరేకల్‌లో ‘సాక్షి’ కథనంపై స్పందించారు. చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న తాము సూర్యాపేటలోని ఒక కళాశాలలో పనిచేసేందుకు వెళ్లగా... ఆ కళాశాల యాజమాన్యం, ఆంధ్రాకు చెందిన వీరయ్య తమను వాటా తీసుకొమ్మని కోరారని, వారికి డబ్బు కూడా ఇచ్చామని చెప్పారు.

మూడేళ్ల కిందట వెళ్లిన వీరయ్య ఇటీవల తిరిగి వచ్చి కళాశాలపై తనకు హక్కు ఉందని వివాదానికి దిగాడన్నారు. నెలకు రూ.లక్ష ఇవ్వాలని కోరాడని, కళాశాలను వదిలి పెట్టకపోతే తమ ఐదుగురిని చంపుతానని బెదిరించారని ఆరోపించారు. తమను బెదిరించడంతోనే ఎమ్మెల్యేను ఆశ్రయించామని... ఎమ్మెల్యే కూడా వీరయ్యను చర్చలకు రావాలని పది సార్లు ఫోన్ చేసినా తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. దాంతో తమ తరఫున ఎమ్మెల్యే గట్టిగా మాట్లాడారే తప్ప బెదిరించలేదని పేర్కొన్నారు.

Advertisement
Advertisement