తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు గ్రీన్‌సిగ్నల్ | Governor narasimhan to green siganl for Telagana public service commission | Sakshi
Sakshi News home page

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు గ్రీన్‌సిగ్నల్

Aug 8 2014 3:36 AM | Updated on Sep 2 2017 11:32 AM

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్‌సీ) ఏర్పాటుకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. దీంతో త్వరలోనే టీపీఎస్‌సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్‌సీ) ఏర్పాటుకు గ వర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. దీంతో త్వరలోనే టీపీఎస్‌సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాష్ట్ర విభజన చట్టంలో టీపీఎస్‌సీ ఏర్పాటయ్యేవరకు ఇక్కడ ఉద్యోగాలను భర్తీ చేయాలంటే ఆ బాధ్యతలను యూపీఎస్‌సీ చూస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వ తొలి కేబినెట్ భేటీలోనే రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ఫైలును రూపొందించి ముఖ్యమంత్రి, గవర్నర్ ఆమోదానికి ఇటీవలే పంపించారు.
 
  బుధవారంనాడే గవర్నర్ ఈ ఫైలుపై ఆమోద ముద్ర వేశారు. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించనుంది. టీపీఎస్‌సీ ఏర్పాటుతో తెలంగాణ నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకోనుంది.  టీపీఎస్‌సీ ద్వారా దాదాపు 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంటుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఇక కమిషన్ చైర్మన్‌గా ఘంటా చక్రపాణిని నియమిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దానిపైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
 
 గెజిటెడ్ అధికారుల సంఘం హర్షం
 టీపీఎస్‌సీకి గవర్నర్ ఆమోదముద్ర వేయడం పట్ల తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. సర్వీసు కమిషన్ విధి విధానాలను రూపొందించి, గవర్నర్ ఆమోదం పొందేలా చేయడంలో సీఎం కేసీఆర్ శ్రద్ధ చూపారన్నారు. త్వరలోనే నిరుద్యోగులకు మేలు చేసే ప్రకటన వస్తుందని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయని వెల్లడించారు. కమిషన్‌లో సభ్యులుగా సమర్థులైన అధికారులను గౌరవ సభ్యులుగా నియమించాలని, మహిళా అధికారిని కార్యదర్శిగా నియమించాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement