కేటీఆర్‌ను కలసిన సైదిరెడ్డి | MLA Saidi Reddy Meets KTR | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ను కలసిన సైదిరెడ్డి

Oct 29 2019 3:40 AM | Updated on Oct 29 2019 3:40 AM

MLA Saidi Reddy Meets KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గా పోటీ చేసి విజయం సాధించిన శానంపూడి సైదిరెడ్డి సోమవారం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నేతలతో ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలసి ధన్యవాదాలు తెలిపారు. హుజూర్‌నగర్‌లో తొలిసారిగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించడంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement