ఎమ్మెల్యే కిషోర్ వివాహ రిసెప్షన్ సందడి | MLA Kishore wedding reception noise | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కిషోర్ వివాహ రిసెప్షన్ సందడి

Aug 28 2014 3:35 AM | Updated on Aug 29 2018 4:16 PM

ఎమ్మెల్యే కిషోర్ వివాహ రిసెప్షన్ సందడి - Sakshi

ఎమ్మెల్యే కిషోర్ వివాహ రిసెప్షన్ సందడి

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్-కమల వివాహ రిసెప్షన్‌ను బుధవారం స్థానిక లక్ష్మీగార్డెన్స్‌లో వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు,

 నల్లగొండ రూరల్ : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్-కమల వివాహ రిసెప్షన్‌ను బుధవారం స్థానిక లక్ష్మీగార్డెన్స్‌లో వైభవంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆశీర్వదించిన వారిలో మంత్రులు నాయిని నర్సిం హారెడ్డి, హరీష్‌రావు, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, పద్మారావు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కడియం శ్రీహరి,  ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గొంగిడి సునీత, వేముల వీరేశం, సినీ డెరైక్టర్లు ఎన్.శంకర్, ఆర్.నారాయణమూర్తి, చిన్న చరణ్, కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, ఏఎస్పీ రామరాజేశ్వరి, జేసీ ప్రీతిమీనా, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీం దర్, నాయకులు బండా నరేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, గాయకుడు గోరటి వెంకన్న ఇరు కుటుం బాల బంధువులు, జిల్లా అధికారులు, వి విధ పార్టీల ప్రజా ప్రతినిధులు  ఉన్నారు.
 
 సీఎంకు ఆతిథ్యం ఇచ్చిన బండా నరేందర్‌రెడ్డి
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జిల్లాకు మొదటిసారిగా వచ్చిన కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. జిల్లా అధికారులు సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. బండా ఇంట్లో ఏర్పాటు చేసిన అల్పాహార విందు తీసుకున్నారు. సా యంత్రం 6.30 గంటలకు వచ్చిన సీఎం కేసీఆర్ అరగంట సేపు బండా ఇంట్లో పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడారు. అనంతరం రిసెప్షన్ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించి 7.30 గంట లకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు.
 
 పటిష్ట బందోబస్తు...
 సీఎం రోడ్డు మార్గం రావడంతో హైదరాబాద్ నుంచి నల్లగొండ వరకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అణువణువు క్షుణ్ణంగా డాగ్‌స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు.  ఎస్పీ ప్రభాకర్‌రావు భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. కల్వర్టులు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వాహనాలను దారి మళ్లించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement