టీఆర్‌ఎస్‌ గెలుపుతో కేంద్రాన్ని శాసిద్దాం | MLA Gongidi Sunitha Election Campaign In Bhongir Constituency | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ గెలుపుతో కేంద్రాన్ని శాసిద్దాం

Apr 1 2019 3:12 PM | Updated on Apr 1 2019 3:13 PM

MLA Gongidi Sunitha Election Campaign In Bhongir Constituency - Sakshi

మాట్లాడుతున్న ఆలేరు ఎమ్మెల్యే సునీత చిత్రంలో బూర నర్సయ్య గౌడ్‌ 

సాక్షి, గుండాల : టీఆర్‌ఎస్‌ గెలుపుతో కేంద్రాన్ని శాసిద్దామని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దపడిశాల, గుండాల, సుద్దాల గ్రామాల్లో నిర్వహించిన రోడ్‌ షోలో ఆమె మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ ను గెలిపించాలని కోరారు. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో బీబీ నగర్‌లో ఎయిమ్స్‌ ఆస్పత్రి ఏర్పాటుకు కృషి చేశారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపిస్తే మరింత అభివృద్ధికి దోహద పడతారన్నారు. భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యర్థిగా గుర్తించి తనను పార్లమెంట్‌కు పంపిస్తే మరిన్ని సేవలు అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ సంగి వేణుగోపాల్‌ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు బండ రమేష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమ్మడి దశరథ, పశు గణనాభివృద్ధి జిల్లా చైర్మన్, మోతె పిచ్చిరెడ్డి, నాయకులు ఎం.ఎ.రహీం, పాండరి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement