అటవీ అధికారిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి | MLA followers attack on the forest officer | Sakshi
Sakshi News home page

అటవీ అధికారిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి

Feb 20 2016 3:16 AM | Updated on Oct 4 2018 6:03 PM

మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట అటవీశాఖ అధికారిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులు శుక్రవారం దాడి చేశారు.

అచ్చంపేట రూరల్: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట అటవీశాఖ అధికారిపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరులు శుక్రవారం దాడి చేశారు. అతిథి గృహం కావాలంటే పై అధికారులను అడగాలన్న వాచ్‌మన్ అంజిని ఎమ్మెల్యే అనుచరులు దుర్భాషలాడారు. తర్వాత ఎమ్మెల్యే బాలరాజు తన అనుచరులతో కలసి ఫారెస్టు రేంజర్ ఆఫీసర్ వై.రామేశ్వర్‌రెడ్డి చాంబర్‌లోకి వెళ్లి అతిథిగృహం కేటాయించాలని అడిగారు. ఉన్నతాధికారులు వస్తున్నందున ఇవ్వలేనని, క్యాంపు ఆఫీసు అందుబాటులో ఉందని సమాధానమిచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే అనుచరులు ఆయనపై దాడి చేశారు. తన గొంతు కింద గాయపర్చి, పిడిగుద్దులు కురిపించారని బాధితుడు వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement