'కార్పొరేటర్లను వదులుకునేందుకు సిద్ధం' | Minister Tummala Nageswara Rao Serious On corporators | Sakshi
Sakshi News home page

'కార్పొరేటర్లను వదులుకునేందుకు సిద్ధం'

Dec 22 2017 11:48 AM | Updated on Dec 22 2017 12:08 PM

 Minister Tummala Nageswara Rao Serious On corporators - Sakshi

ఖమ్మం నగరపాలక సంస్థ కార్పొరేటర్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహానికి గురయ్యారు.

సాక్షి, ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్థ కార్పొరేటర్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహానికి గురయ్యారు. పట్టణంలో కార్పొరేటర్లతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల పనితీరుపై తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లకు చెడ్డపేరు వస్తే ప్రభుత్వానికి చెడు పేరు వస్తుందన్నారు. ప్రజలకు మంచి పేరు తెచ్చేలా ప్రజా ప్రతినిధులు పని చేయాలన్నారు. 

ఖమ్మం కార్పొరేషన్ లో జరుగుతున్న అభివృద్ది సీఎం కేసీఆర్ సహా అందరూ మెచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల దయతో గెలిచిన తాము ప్రజల కోసం పని చేయాలన్నారు. పద్దతి మార్చుకోని కార్పొరేటర్లు సహించేది లేదని హెచ్చరించారు. ఒకటి రెండు సీట్లను వదులుకోవడానికైనా తాము సిద్ధమన్నారు. ఖమ్మం ఎమ్మెల్యే సీటు వచ్చే ఎన్నికలలో భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు. ఎక్కడా గ్రూపులు ఉండవని అందరూ కేసీఆర్ మనుషులేనని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement