
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లోని 6,7, 8 ప్యాకేజీల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని.. వచ్చే వానాకాలం నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆయన ఈ మూడు ప్యాకేజీల పనులపై సమీక్షించారు. 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో కాళేశ్వ రం ప్రాజెక్టు చేపట్టామని.. పనులను శరవేగం గా కొనసాగించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఏడో ప్యాకేజీ పనుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌజ్, అన్నారం బ్యారేజీల పనులు ఊపందుకున్నాయన్నారు. సమావేశంలో కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ శ్రీధర్, వివిధ కాంట్రాక్టు ఏజన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.