గోదాములకు మంత్రి హరీశ్‌ భూమి పూజ | Minister Harish Rao Lays Foundation Stone For Godown In Nalgonda | Sakshi
Sakshi News home page

3కోట్లతో నిర్మిస్తున్న గోదాములకు మంత్రి భూమి పూజ

Apr 24 2018 3:25 PM | Updated on Apr 24 2018 3:25 PM

Minister Harish Rao Lays Foundation Stone For Godown In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ : జిల్లాలోని కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న 5 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములకు మంత్రి హరీశ్‌ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసిన ధాన్యం రాశులే కన్పిస్తున్నందుకు చాలా ఆనందగా ఉంది. జిల్లా ధాన్యం కొనుగోల్లలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. డిండి ప్రాజెక్టులో నీళ్లు లేకున్నా కల్వకుర్తి నుంచి నీరిచ్చాం. సాగర్‌ కింద వారబందితో రైతులకు నీరందించాం. తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారు. సాగు చేసే ప్రతి  రైతుకు పెట్టుబడి పథకాన్ని అమలు చేస్తాం. మరికొద్ది రోజుల్లో ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద రైతులకు సాగు నీరు ఇస్తాం. నకిరేకల్‌లో నెల రోజుల్లో నిమ్మ మార్కెట్‌ ప్రారంభిస్తాం. నల్లగొండలో బత్తాయి మార్కెట్‌ పనులు పూర్తయ్యాయి, దాన్ని కూడా త్వరలో అందుబాటులోకి తెస్తాం’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement