సౌదీలో వలస కూలీ మృతి! | Migrant worker died in Saudi! | Sakshi
Sakshi News home page

సౌదీలో వలస కూలీ మృతి!

Jul 15 2017 2:14 AM | Updated on Sep 5 2017 4:02 PM

సౌదీలో వలస కూలీ మృతి!

సౌదీలో వలస కూలీ మృతి!

జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు

కోస్గి (కొడంగల్‌): జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు.  మహ బూబ్‌నగర్‌ జిల్లా కోస్గి మండలం పోలేపల్లి పల్లెగడ్డకు చెందిన మల్లయ్య(35) జీవనోపాధి కోసం 2014లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. మల్లయ్య మృతి చెందాడంటూ తోటి కూలీలు గురువారం ఫోన్‌ చేసి ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు.

అయితే, పూర్తి సమా చారం తెలుసుకునేందుకు ఆరా తీయగా మొదట ఫోన్‌ చేసిన కూలీలు మళ్లీ అందు బాటులోకి రాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోవడంతో శుక్రవా రం కలెక్టర్‌ రొనాల్డ్‌రాస్‌ను కలసి తమ పరిస్థితి వివరించారు. ఎంపీ జితేందర్‌ రెడ్డికి ఫోన్‌లో సమాచారం ఇవ్వగా ప్రభుత్వం తరఫున∙విదేశాంగ మంత్రితో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement