ఆన్‌లైన్‌లో మెడికల్‌ టీమ్‌ షెడ్యూల్‌: సీఎస్‌

Medical Team Schedule in Online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటి వెలుగుకు సంబంధించి గ్రామాల వారీగా మెడికల్‌ టీమ్‌లు పర్యటించే షెడ్యూల్‌ను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని అధికారులను సీఎస్‌ ఎస్‌.కె.జోషి ఆదేశించారు. మంగళవారం కంటివెలుగు, హరితహారం, సాధారణ ఎన్నికలపై సచివాలయంలో జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో విజయవం తంగా నిర్వహించడానికి అధికారులు, మంత్రులను సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు.

వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ఆగస్టు 15న కంటి వెలుగు ప్రారంభించే గ్రామాలను నిర్ణయించి మెడికల్‌ టీమ్‌లతో ఆ ప్రాంతాలను ముందే తనిఖీ చేయాలన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు ఉన్నందున అవసరమైన ఏర్పాట్లపై సీఎస్, ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ రజత్‌ కుమార్‌ కలెక్టర్లతో సమీక్షించారు.

రజత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల ప్రకారం ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి హౌజ్‌ ఓల్డ్‌ సర్వే మే 21న ప్రారంభించి జూన్‌ 30న పూర్తి చేశామని, పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. హరితహారంపై జరిపిన సమీక్ష సమావేశంలో గజ్వేల్‌లో కేసీఆర్‌ మొక్కలు నాటే సమయానికి అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్లకు జోషి సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top