ఈతకు వెళ్లి ఎంబీఏ విద్యార్థి దుర్మరణం | MBA student died while doing swimming | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ఎంబీఏ విద్యార్థి దుర్మరణం

May 29 2014 11:22 PM | Updated on Oct 16 2018 2:53 PM

సరదాగా స్నేహితులతో కలిసి చెరువులో ఈతక ని వెళ్లి అందులో మునిగి ఎంబీఏ విద్యార్థు ఒకరు గు రువారం మృతిచెందాడు. ఎస్‌ఐ జార్జ్ కథనం మేరకు..

తొగుట, న్యూస్‌లైన్ : సరదాగా స్నేహితులతో కలిసి చెరువులో ఈతక ని వెళ్లి అందులో మునిగి ఎంబీఏ విద్యార్థు ఒకరు గు రువారం మృతిచెందాడు. ఎస్‌ఐ జార్జ్ కథనం మేరకు.. మండలంలోని పెద్దమాసాన్‌పల్లి గ్రామానికి చెందిన పన్యాల ముత్యంరెడ్డి, యాదమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు పన్యాల సంతోష్‌రెడ్డి ఉన్నాడు. సంతోష్‌రెడ్డి సిద్దిపేటలోని ఎంల్లకి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ ఏడాది చదువుతున్నాడు. అ యితే వేసవి సెలవులు కావడంతో స్వగ్రామానికి వచ్చా డు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామానికి చెందిన ఇ ద్దరు స్నేహితులు కరుణాకర్‌రెడ్డి, సాయికుమార్‌రెడ్డిల తో కలిసి గ్రామ శివారులో ఉన్న పెద్దచెర్వుకు ఈతకని వెళ్లారు. అయితే వీరికి ఈత రాకపోవడంతో ముగ్గురూ చెరువు గట్టునే ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో సంతోష్‌రెడ్డి ఈత కొడుతూ కొద్ది లోనికి వెళ్లాడు. అ క్కడ జేసీబీ గుంత ఉండడంతో అందులో మునిగిపోయాడు. సంతోష్‌రెడ్డిని కాపాడేందుకు స్నేహితులు సా హసం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు చెరువు వద్దకు చేరుకుని సంతోష్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలిం చినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తండ్రి ముత్యంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 
 గ్రామంలో విశాదఛాయలు..
 అందరితోనూ కలివిడిగా ఉండే సంతోష్‌రెడ్డి మృతి చె ందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నా యి. ఒక్కగానొక్క కుమారుడు చేతికి అందివచ్చే క్రమం లో మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, బంధువులు, మృతుని స్నేహితులు చెరువు వద్దకు చేరుకుని కన్నీటి పర్యాంతమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ రాజాగౌడ్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కూచి మహిపాల్‌రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, పన్యాల ఎల్లారెడ్డి, రాజిరెడ్డి, రాధాకిషన్‌రెడ్డి, లతో పాటు మరికొందరూ సంఘటనా స్థలానికి చేరుకోని మృతుడి కుటుంబాన్ని పరామర్శించి  ఓదార్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement