కరీంనగర్ పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో దొంగలు విలువైన విగ్రహాలు, వెండి వస్తువులను ఎత్తుకుపోయారు.
కరీంనగర్ పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌లో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో దొంగలు విలువైన విగ్రహాలు, వెండి వస్తువులను ఎత్తుకుపోయారు. పోలీసుల కథనం మేరకు శనివారం రాత్రి 9 గంటలకు పూజారి ఆలయం గర్భగుడికి తాళాలు వేసి వెళ్లారు. ఆలయం ముందు వినాయకుడి విగ్రహం పెట్టి నవరాత్రోత్సవాలు నిర్వహిస్తుండటంతో.. రాత్రి 11.30 గంటల వరకు ఆ ప్రాంతం సందడిగా ఉంది. కాగా, తెల్లవారుజామున ఆలయం తాళాలు పగులగొట్టి ఉండడాన్ని చూసిన స్థానికులు సెక్యూరిటీ గార్డుకు సమాచారం ఇచ్చారు. అతడు పోలీసులకు సమాచారం అందించాడు. గర్భగుడిలో స్వామి మూలవిరాట్టుకు అలంకరించిన నాలుగు కిలోల వెండి ఆభరణాలు.. వెండి విగ్రహం.. పంచలోహ విగ్రహం.. హుండీలో నగదును దొంగలు కొల్లగొట్టారు.