కరీంనగర్లో భారీ చోరీలు | massive theft in karimnagar district | Sakshi
Sakshi News home page

కరీంనగర్లో భారీ చోరీలు

Jan 25 2015 3:15 PM | Updated on Sep 2 2017 8:15 PM

కరీంనగర్ నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకరోజే వేర్వేరు చోట్ల బంగారం చోరీ చేశారు.

కరీంనగర్ క్రైం: కరీంనగర్ నగరంలో చైన్ స్నాచర్లు  రెచ్చిపోయారు. ఒకే రోజు వేర్వేరు చోట్ల బంగారం చోరీ చేశారు. వివరాలు.. నగరంలోని భాగ్యనగర్‌కు చెందిన చవోటి విజయవర్షిణి కిరాణా దుకాణం వద్దకు వెళ్లి పాలు తీసుకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి.. ఆమె  మెడలోని 3 తులాల పుస్తెలతాడు తెంచుకుని పారిపోయాడు.

విద్యానగర్‌కు చెందిన పెండ్యాల విద్యాగౌతమి (34)  ఆలయానికి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని 5 తులాల పుస్తెలతాడు, నల్లపూసల దండ తెంపుకొని పారిపోయారు.

అదే కాలనీలో ఉంటున్న కొమ్మ విజయ (45) కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సిగరెట్ అడిగాడు. అది ఇవ్వడానికి రాగా ఆమె మెడలోని మూడున్నర తులాల పుస్తెలతాడును తెంచుకుని పారిపోయాడు. ఆమె అరిచినా సమీపంలో ఎవరూ లేకపోవడంతో దొంగ తన బైక్‌పై పారిపోయాడు. ముగ్గురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టుటౌన్ సీఐ హరిప్రసాద్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement