ముడుపుల వ్యవహారంలో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని జైలుకు తరలించడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్: ముడుపుల వ్యవహారంలో అరెస్టైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని జైలుకు తరలించడంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. న్యాయమూర్తి అనుమతితో ఈ ఉదయం ఓటు వేసేందుకు ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఓటు వేయకుండా కాలయాపన చేసేందుకు రేవంత్ లో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కమిటీ హాల్ లో సమావేశం పెట్టుకున్నారు.
ఎన్నికలు జరుగుతుండగా సమావేశం ఎలా పెట్టుకుంటారని మంత్రులు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల పరిశీలకుడు అదర్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. దీంతో రేవంత్ రెడ్డిని తరలించేందుకు మార్షల్స్ ను రంగంలోకి దించారు. అసెంబ్లీ నుంచి ఆయనను మార్షల్స్ బయటకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. రేవంత్ రెడ్డిని తర్వాత పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.