4 రోజులుగా కారులో తిప్పుతూ వివాహితపై గ్యాంగ్ రేప్ | married woman gang raped in moving car | Sakshi
Sakshi News home page

4 రోజులుగా కారులో తిప్పుతూ వివాహితపై గ్యాంగ్ రేప్

Jan 12 2015 9:18 AM | Updated on Sep 2 2017 7:36 PM

4 రోజులుగా కారులో తిప్పుతూ వివాహితపై గ్యాంగ్ రేప్

4 రోజులుగా కారులో తిప్పుతూ వివాహితపై గ్యాంగ్ రేప్

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

వరంగల్: నెల్లూరుకు చెందిన ఓ వివాహితను బలవంతంగా వరంగల్ జిల్లాకు జిల్లాకు తీసుకువచ్చి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడిన దారుణ సంఘటన వెలుగుచూసింది.  ఐదు రోజుల క్రితం నెల్లూరు నగరానికి చెందిన వివాహితను అదే ప్రాంతానికి చెందిన నలుగురు దుండగులు బలవంతంగా కారులో తీసుకువచ్చారు. వరంగల్ జిల్లాలో నాలుగు రోజులుగా కారులో తిప్పుతూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పంథిని వద్ద ఆమెను చంపేందుకు ప్రయత్నించారు. దుండగులు ఆమెను కత్తితో పొడిచి కారులోంచి తోసివేసి పరారయ్యారు. ఆమె పొట్టపై కత్తిపోట్లు ఉన్నాయి. స్థానికులు ఆమెను గమనించి 108లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement