
సాక్షి, హైదరాబాద్: సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి నీరజాశాస్త్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న భూసార పరీక్షలు, భూసార కార్డులు, సేంద్రియ వ్యవసాయ పథకాల పరిశీలనకు నీరజాశాస్త్రి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా శనివారం వ్యవసాయ శాఖ కమిషనర్ ఎం.జగన్‌మోహన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నల్లగొం డ, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నా రు. నీరజాశాస్త్రి మాట్లాడుతూ మార్కెటింగ్ సదుపాయాల అనుసం ధానం కోసం మార్కెట్ యాజమాన్య నిపుణుల సహకారాన్ని తీసుకోవ డానికి యోచిస్తున్నట్లు చెప్పారు.
సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తున్న రైతులను పథకాల్లో భాగస్వాములను చేస్తే అమలు మరింత మెరుగ్గా జరుగుతుందన్నారు. భూసార కార్డులు, పీకేవీవై పథకాల అమలు, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి జిల్లా వ్యవసాయ అధికారులు సమావేశంలో వివరించారు. భూసార పరీక్షా కార్డులు రైతులకు సక్రమం గా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆమె కీసర మండలం గోధుమకుంట గ్రామంలో జీరో బడ్జెటింగ్ పద్ధతిలో సహజ వ్యవసాయం చేస్తున్న రైతు వెంకటరెడ్డి చేనును పరిశీలించారు. ఆయన నేల ఉప పొరల్లోని మట్టిని ఉపయోగించి చేస్తున్న సాగు విధానాన్ని అడిగి తెలుçసుకు న్నారు. అలాగే రాజేంద్రనగర్‌లోని భూసార పరీక్షా కేంద్రాన్ని, జీవఎరువుల ప్రయోగ శాలను సందర్శించారు. భూసార పరీక్షలు చేస్తున్న పద్ధతులు, క్షేత్రస్థాయిలోని ఇబ్బం దులను అడిగి తెలుసుకున్నారు.