నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టు పోస్టర్లు కలకలం సృష్టించాయి.
డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం గన్నారం గ్రామంలో శనివారం తెల్లవారుజామున మావోయిస్టు పోస్టర్లు కలకలం సృష్టించాయి. గ్రామంలో మూడు చోట్ల మావోయిస్టుల పేరుతో హెచ్చరికల పోస్టర్లు వెలిశాయి. పీపుల్స్‌వార్ సిర్నాపల్లి ఏరియా పేరుతో ఉన్న పోస్టర్లలో... ప్రజాపత్రినిధులు, అరాచకవాదులు జాగ్రత్తగా మసలుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. సమాచారం అందుకున్న డిచ్‌పల్లి పోలీసులు గ్రామానికి చేరుకుని పోస్టర్లను తొలగించారు.