మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన దుబాషి శంకర్ తల్లి నర్సమ్మ(80)కు మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘ఆసరా’గా నిలిచారు.
దుబ్బాక: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన దుబాషి శంకర్ తల్లి నర్సమ్మ(80)కు మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘ఆసరా’గా నిలిచారు. సమగ్ర కుటుంబ సర్వే ఫలితంగా.. దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన దుబాషి నర్సమ్మకు అధికారులు పింఛన్ తొలగించారు.
కొన్ని సంవత్సరాలుగా పింఛన్ తీసుకుంటున్న నర్సమ్మ ఇటీవల వెల్లడించిన పింఛన్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఎమ్మెల్యే ఎదుట గోడు వెలుబుచ్చింది. దీంతో చలించిన ఆయన ఆదివారం కలెక్టర్ రాహుల్‌బొజ్జాతో ఫోన్‌లో మాట్లాడుతూ పింఛన్ మంజూరు చేయాలని కోరారు.
నర్సమ్మకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు శంకర్ 30 ఏళ్ల కింద అజ్ఞాతంలోకి వెళ్లాడు. యాదయ్యకు వ్యవసాయ ట్రాక్టర్ ఉండడం వల్ల నర్సమ్మకు అధికారులు పింఛన్ తొలగించారు.