మద్యం బదులు శానిటైజర్ల తయారీ | Manufacture Of Sanitizer Instead Of Alcohol In Telangana | Sakshi
Sakshi News home page

మద్యం బదులు శానిటైజర్ల తయారీ

Apr 8 2020 4:22 AM | Updated on Apr 8 2020 4:22 AM

Manufacture Of Sanitizer Instead Of Alcohol In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడికి ప్రైవేటు సంస్థలు ముం దుకొచ్చాయి. ఇన్నాళ్లు ప్రజలకు కిక్కిచ్చే మద్యాన్ని తయారు చేసిన డిస్టిలరీలు ఇప్పుడు కరోనా ముప్పు దరి చేరకుండా ‘సామాజిక బాధ్యత’ను పాటిస్తున్నాయి. మద్యం బదులు శానిటైజర్లను తయా రు చేసి ప్రభుత్వానికి చేయూత అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో వీటి లభ్యత అంతంతగానే ఉంది. ఈ కొరతను అధిగమిం చేందుకు ప్రభుత్వం డిస్టిలరీలను శానిటైజర్ల ఉత్పత్తుల తయారీకి మళ్లించింది. హ్యాండ్‌ వాష్‌ శానిటైజర్ల తయారీకి డిస్టిలరీల సేవల ను వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

లాక్‌డౌన్‌తో ప్ర స్తుతం మద్యం ఉత్పత్తులను నిలిపివేసినందున.. దీని స్థానంలో శానిటైజర్లను తయారు చేసేలా చూడాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద శానిటైజర్లను తయారు చేయాలని డిస్టిలరీల యాజమాన్యాలను కోరింది. సానుకూలంగా స్పందించిన మద్యం తయారీ సంస్థలు ఇప్పటివరకు 40 వేల లీటర్ల మేర రాష్ట్ర వైద్య సదుపాయాల కల్పనాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ)కు సరఫరా చేసింది. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేస్తోంది.

కరోనా నివారణ దళానికే ప్రాధాన్యం..
సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోని 18 డిస్టిలరీలు శానిటైజర్లను త యారు చేసి టీఎస్‌ఎంఐడీసీకి అందజేశాయి. అక్కడి నుంచి ప్రభు త్వ ఆస్పత్రులు, కార్యాలయాలు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు పంపిణీ చేసినట్లు సంగారెడ్డిలోని ఓ డిస్టిలరీ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. మొదటి దశలో ఇచ్చిన ఇండెంట్‌ మేరకు సరఫరా చేశామని, ప్రభుత్వం ఆదేశిస్తే అధిక సామర్థ్యంలోనూ శానిటైజర్లను తయారీ చేసి అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

శానిటైజర్‌ తయారీ ఇలా..
పది లీటర్ల శానిటైజర్‌ తయారీలో.. 8,333 మిల్లీ లీటర్ల ఇథనాల్, 417 మి.లీటర్ల హైడ్రోజెన్‌ పెరాక్సైడ్, 145 మి.లీటర్ల గ్లిజరాల్, 1,105 మి.లీటర్ల డిస్టిల్‌ వాటర్‌ను వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా శానిటైజర్‌లో మిశ్రమాలను కలుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement