ఏడడుగులు నడిచి జీవితాంతం భార్యను కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రమాణం చేసిన భర్తే తన భార్యను కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా మండల పరిధిలోని రామాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
అలంపూర్ (మహబూబ్నగర్) : ఏడడుగులు నడిచి జీవితాంతం భార్యను కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రమాణం చేసిన భర్తే తన భార్యను కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన కేసులో ఏడేళ్ల జైలు శిక్ష పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా మండల పరిధిలోని రామాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వడ్డేపల్లి మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన సువార్తమ్మను భర్త చిన్నతిమ్ములు 2013 ఫిబ్రవరి 15న కిరోసిన్ పోసి నిప్పంటించాడని శాంతినగర్ పోలీస్ స్టేషన్‌లో అప్పట్లో కేసు నమోదైంది.
కాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ్‌కుమార్ వాదించగా రెండేళ్లుగా జరిగిన విచారణలో నేరం రుజువైనందున గద్వాల కోర్టు జడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం హరిజన్ చిన్నతిమ్ములుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించినట్లు శాంతినగర్ ఏఎస్సై మీడియాకు వివరించారు.