కడుపు నొప్పితో వస్తే కాటికి పంపారు | Man Died In doctors negligence In Private hospital Hyderabad | Sakshi
Sakshi News home page

కడుపు నొప్పితో వస్తే కాటికి పంపారు

Aug 24 2018 7:55 AM | Updated on Sep 4 2018 5:53 PM

Man Died In doctors negligence In Private hospital Hyderabad - Sakshi

శ్రీనివాసరెడ్డి (ఫైల్‌)

భాగ్యనగర్‌కాలనీ: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మరణించాడని మృతుడి తల్లితో పాటు కుటుంబ సభ్యులు గురువారం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి (32) చింతల్‌లో నివాసముంటూ కూకట్‌పల్లిలోని హోండా షోరూమ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో శ్రీనివాసరెడ్డిని తోటి ఉద్యోగులు సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. శ్రీనివాసరెడ్డి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement