మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు.
మెదక్(పటాన్‌చెరు): మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పటాన్‌చెరులో ఆదివారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ధాండూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆదివారం పటాన్‌చెరుకు వచ్చాడు.
అయితే తన భార్య కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసేందుకు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఫిర్యాదును కుంటుంబ సభ్యులు ఉన్న ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేయాలని తెలిపారు. దీంతో కొత్తగా నిర్మిస్తున్న 11కెవీ టవర్ ఎక్కి బలవన్మరణానికి యత్నించాడు. అయితే పోలీసులు సదరు వ్యక్తితో మాట్లాడి కిందకి దించారు.