ఆరుబయట తాగితే అంతే

Police Surveillance Of People Drinking Alcohol In Public In Vizianagaram - Sakshi

బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై పోలీస్‌ నిఘా

నెల వ్యవధిలో 1,894 కేసుల నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్‌ డ్రైవ్‌

ఎస్పీ  దీపికా ఎం.పాటిల్‌

విజయనగరం:  మందుబాబుల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. బహిరంగ మద్యపానం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై నిఘా పటిష్టం చేసింది.  ఓ పక్క కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌పై ప్రజలను అప్రమత్తం చేస్తూనే మరో పక్క ఎస్పీ దీపికా ఎం.పాటిల్‌ ఆదేశాలతో  రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్న వారిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుని  కేసులు నమోదుచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా  కేవలం నెల రోజుల వ్యవధిలోనే  122 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదుచేసింది.  బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన  వారిపై కొరడా ఝుళిపించి 1,894 కేసులు నమోదుచేసింది.

185 మందిపైన ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. స్నిపర్,  షాడోటీంమ్‌లతో పాటు స్పెషల్‌ టీమ్‌లు ఏర్పాటుచేసి కోడిపందాలు, పేకాట, మద్యం తాగి  బైక్‌లు నడపడం, శివారు ప్రాంతాల్లో తగాదాలు, గ్రామాల్లో కొట్లాటలు వంటివి లేకుండా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో నాటుసారా, గంజాయి, నల్లబెల్లం ఊటలు, ఇసుకఅక్రమ తవ్వకాలపై ఎస్‌ఈబీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. అలాగే జిల్లా పోలీసుల సాయంతో ఆయా స్టేషన్‌ల పరిధిలో కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌పై అప్రమత్తత అంశాలను, మరో పక్క దిశా యాప్‌పై విస్త్రత అవగాహన చేపడుతున్నారు.  మహిళా సంరక్షణ పోలీసుల సాయంతో  గ్రామాల్లోని వార్డుల్లో విస్త్రతంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై అవగాహన కలి్పంచే దిశగా జిల్లా పోలీస్‌ శాఖ కృషిచేస్తోంది.  

కఠిన చర్యలు చేపడతాం
రోడ్డుప్రమాదాల నివారణకు కృషిచేస్తున్నాం. చిన్న చిన్న తగాదాలు ఎక్కువగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి. బమిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలకారు.
-దీపికా ఎం.పాటిల్‌, ఎస్పీ, విజయనగరం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top