హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య.. | man commits suicide | Sakshi
Sakshi News home page

హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య..

May 5 2015 4:33 PM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ సమస్యలతో ఒక వ్యక్తి హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజేంద్రనగర్ (రంగారెడ్డి జిల్లా): కుటుంబ సమస్యలతో ఒక వ్యక్తి హిమాయత్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని హిమాయత్‌సాగర్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... బి.ఆనందరావు అనే వ్యక్తి కుటుంబ సమస్యలతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మంగళవారం హిమాయత్‌సాగర్‌లో శవమై తేలాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement