మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం  | Malla Reddy Blackout By People In Rangareddy District | Sakshi
Sakshi News home page

మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం 

Aug 29 2019 9:02 AM | Updated on Aug 29 2019 9:26 AM

Malla Reddy Blackout By People In Rangareddy District - Sakshi

మంత్రి మల్లారెడ్డిని అడ్డుకుంటున్న మహిళలు

సాక్షి, మేడ్చల్‌: కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి తన సొంత ఇలాకాలో బుధవారం చేదు అనుభవం ఎదురైంది. మంత్రి పుట్టిపెరిగిన ఊరు, మంత్రికి చెందిన ఇంజనీరింగ్‌ కాలేజీల సామ్రాజ్యంతో నిండిపోయిన మైసమ్మగూడలో మంత్రి మల్లారెడ్డిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వివరాల్లోకెళ్తే... గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు. అనంతరం మైసమ్మగూడలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించేందుకు వస్తున్న మంత్రి కాన్వాయ్‌ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తమ కాలనీలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని మహిళలు డిమాండ్‌ చేశారు. దీంతో కంగు తిన్న మంత్రి మల్లారెడ్డి కాలనీలో పర్యటించి సమస్యలు తెలసుకున్నారు. గ్రామంలోని కాలనీల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణంతో పాటు తాగు నీటి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో మహిళలు ఆందోళన విరమించారు. 

Advertisement
 
Advertisement
Advertisement