ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దు : మాల మహానాడు | mala mahanadu leaders meets central minister over against to sc classification | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దు : మాల మహానాడు

Jul 27 2016 4:13 AM | Updated on Mar 28 2019 6:27 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దని, దేశంలో వర్గీకరణ ఎక్కడా లేదని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌కు మాల మహానాడు ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది.

 కేంద్ర మంత్రి గెహ్లాట్‌కు మాల మహానాడు వినతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దని, దేశంలో వర్గీకరణ ఎక్కడా లేదని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌కు మాల మహానాడు ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది.

మంగళవారం మంత్రిని కలసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య నేతృత్వంలోని బృందం.. వర్గీకరణ వల్ల నష్టాలను వివరించింది. వర్గీకరణకు వ్యతిరేకంగా ఆరో రోజు దీక్షలో చెన్నయ్య మాట్లాడుతూ.. రెండు కళ్ల సిద్ధాంతంతో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, మనువాద కుట్రలతో ఎస్సీలను వర్గీకరించాలని చూస్తోందని, దీని వెనక కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. దళితులను విభజించి పాలించడమే బీజేపీ సిద్ధాంతమని, ఇప్పటికైనా వెంకయ్య ఈ కుట్రలు మానుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement