గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేయండి | Sakshi
Sakshi News home page

గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేయండి

Published Thu, Jun 15 2017 12:27 AM

గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేయండి - Sakshi

జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ ఎస్‌పీ సింగ్‌ ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఎస్‌.పి.సింగ్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌ చందా, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, హరిత హారం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ వెంకటే శ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌.పీ.సింగ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారని, గొర్రెల పంపిణీకి పక్కాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. మొదటి ఏడాదీ దాదాపు 3.5లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పథకం అమలులో అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. మొదటి విడత పంపిణీలో ఎంపిక చేసిన సొసైటీలు, సభ్యుల వివరాలను ఈ–లాబ్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

గొర్రెల ట్యాగింగ్, ఇన్సూరెన్స్‌ డాక్యుమెంటేషన్‌కు తగు సిబ్బందిని, గొర్రెల ఆరోగ్యాన్ని పరిరక్షించటానికి డాక్టర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల వాటా 25 శాతం కంట్రిబ్యూషన్‌ వసూలు చేయాలన్నారు. స్టైలో గ్రాస్‌ పెంపకానికి తగు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌ చందా మాట్లాడుతూ, కలెక్టర్లు సొసైటీలు, గ్రామాల వారీగా తగిన ప్రాధాన్యం రూపొందించుకొని కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. చెల్లింపులన్ని అకౌంట్‌ పే ద్వారా జరగాలన్నారు. గొర్రెలను అమ్మే వారి ఆధార్‌ , ఐడి కార్డుల వివరాలను సేకరించాలన్నారు. పంపిణీ చేసిన గడ్డి విత్తనాలు పెంచడానికి స్థలాలను గుర్తించి, సొసైటీలకు బాధ్యత అప్పగించాలన్నారు.

సాదాబైనామాలపై సమీక్ష
పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా కేసులను పరిష్కరించి ఈ నెల 21వ తేదీ లోపు అప్‌ లోడ్‌ చేయాలని సీఎస్‌ ఎస్‌పీ సింగ్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశిం చారు. ఆ తర్వాత సాఫ్ట్‌ వేర్‌ అందు బాటులో ఉండదని అప్రమత్తం చేశారు. మరో 11.31 శాతం కేసులు పరిష్కరిం చాల్సి ఉందన్నారు. భూపాలపల్లి, ఖమ్మం, వరంగల్‌ (అర్బన్, రూరల్‌) జిల్లాల్లో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement