నాటి కబడ్డీ టీం కెప్టెన్‌.. నేడు సచివాలయం ముందు..

Mahabubabad Kabaddi Player Protests Infront Of TS Secretariat - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: సచివాలయంలో సీబ్లాక్ ముందు గతంలో ఇండియా కబడ్డీ టీంకు కెప్టెన్‌గా పనిచేసిన కొమురయ్య అనే యువకుడు తనకు ఉద్యోగం రాని కారణంగా మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరిగినా ఉద్యోగం రాకపోవడంతో కొమురయ్య ఆందోళన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ నరసింహ్మలు పేట మండలం కొముల వంచ గ్రామానికి చెందిన  కొమురయ్య, మోడల్ స్కూల్లో పీఈటీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. తనకు ఉద్యోగానికయ్యే అన్ని అర్హతలున్నా ఉద్యోగం ఇవ్వక పోవడం సరికాదన్నారు. గతంలో తాను ఏడాది పాటు భారత కబడ్డీ టీంకు కెప్టెన్‌గా ఉన్నానని, అంతర్జాతీయ కబడ్డీ పోటీలలో భారత్‌కు నేతృత్వం వహించానని కొమురయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top