ప్రచారంలో ఎదురుపడి.. | Madhira Assembly Constituency Candidates Canvass | Sakshi
Sakshi News home page

ప్రచారంలో ఎదురుపడి..

Nov 24 2018 11:35 AM | Updated on Nov 24 2018 11:35 AM

Madhira Assembly Constituency Candidates Canvass - Sakshi

సాక్షి, మధిర: మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి(కాంగ్రెస్‌) తరఫున మల్లు భట్టి విక్రమార్క, టీఆర్‌ఎస్‌ నుంచి లింగాల కమల్‌రాజ్‌ ప్రధా న పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మధిర నగరపంచాయతీ పరిధిలోని 17వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కమల్‌రాజ్‌తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. అదే సమయంలో, అదే వార్డు లో కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి భట్టి తనయుడు మల్లు సూర్యవిక్రమాదిత్య ను వెంటబెట్టుకుని ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాహనాలు ఎదురెదురుగా వచ్చాయి. ఎదురైన వాహనాలు తప్పుకునేటప్పుడు, కార్యకర్తలు ఒకే చోటకు చేరినప్పుడు ఏమైనా వివాదం జరుగుతుందేమోనని ఒకింత ఆందోళన నెలకొంది. అయితే ఎవరికివారే ప్రశాతంగా ప్రచా రం నిర్వహించుకున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement