
సాక్షి, సిటీబ్యూరో: గృహోపయోగ వంట గ్యాస్ ధర పెరిగింది. రెండు మాసాలుగా వరుసగా తగ్గిన వంట గ్యాస్ ధర ఈసారి మాత్రం స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సిలిండర్ ధర రూ.628లు ఉండగా, పెరిగిన ధరతో అది రూ.644కు చేరింది. పెరిగిన ధర ఆదివారం నుంచే అమల్లోకి వచ్చింది.