ప్రియుడి ఇంట్లో బైఠాయింపు | Lover Protest in Boyfriend Home Warangal | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంట్లో బైఠాయింపు

Jul 23 2020 1:20 PM | Updated on Jul 23 2020 1:20 PM

Lover Protest in Boyfriend Home Warangal - Sakshi

ప్రియుడి ఇంట్లో బైఠాయించిన ప్రియురాలు

వరంగల్‌ అర్బన్‌ ,ఎల్కతుర్తి: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంట్లో బైఠాయించి నిరసనకు దిగింది. ఈ సంఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. దామెరకు చెందిన ప్రశాంత్‌కు, ధర్మసాగర్‌ మండలం దేవునూర్‌కు చెందిన ఓ యువతికి గుడిలో పరిచయం ఏర్పడింది.

అది కాస్తా ప్రేమగా మారడంతో నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నాలుగు రోజులుగా ప్రశాంత్‌ ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వస్తుంది. దీంతో సదరు యువతి బంధువులతో ప్రశాంత్‌ ఇంటికి చేరుకుని బైఠాయించింది. న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తానని భీష్మించుకు కూర్చుంది. విషయం తెలుసుకున్న ఎస్సైలు గడ్డం ఉమ, టీవీఆర్‌ సూరి, స్వప్న సిబ్బందితో దామెరకు చేరుకుని రెండు రోజుల్లో న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement