చక్రాలూడిన ఆర్టీసీ బస్సు | Lost control bus Injuries driver | Sakshi
Sakshi News home page

చక్రాలూడిన ఆర్టీసీ బస్సు

Jan 9 2015 4:27 AM | Updated on Sep 2 2017 7:24 PM

చక్రాలూడిన ఆర్టీసీ బస్సు

చక్రాలూడిన ఆర్టీసీ బస్సు

మండలంలోని ముస్తాపూర్ గ్రామ శివారులో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు ముందు చక్రాలు విరిగిబస్సు అదుపుతప్పింది.

అదుపు తప్పిన బస్సు- డ్రైవర్‌కు గాయాలు
లింగంపేట : మండలంలోని ముస్తాపూర్ గ్రామ శివారులో గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు ముందు చక్రాలు విరిగిబస్సు అదుపుతప్పింది. ఏపీ25 వి8065 నంబర్‌గల ఆర్టీసీ హైర్(అద్దె) బస్సు కామారెడ్డి నుంచి నిజాంసాగర్ వెళ్తుండగా ముస్తాపూర్ గ్రామ శివారులో ముందు చక్రాల రాడ్ విరిగి ప్రమాదానికి గురైంది.

ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాపర్తి సాయిలుకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక 108 సిబ్బంది డ్రైవర్‌ను వైద్య చికిత్సల నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెల్సుకున్న స్థానిక ఎస్సై పల్లె రాకేశ్, కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ జగదీశ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement