పనిలేకున్నా ఆన్‌డ్యూటీ స్టిక్కర్లతో తిరిగితే..

Lockdown: Lorry Driver Attack On Police At Bodhan Checkpost - Sakshi

సాక్షి, బోధన్‌ రూరల్‌: అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లడమే కాకుండా కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడో లారీ డ్రైవర్‌. కరోనా నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని సాలూర అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు జిల్లాలోకి రాకుండా నియంత్రిస్తున్నారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున బోధన్‌ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ (పీబీ13ఏఎల్‌9637)ని పోలీసులు ఆపేందుకు యత్నించారు. అయితే, సదరు లారీ డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతివేగంగా దూసుకెళ్లాడు. దీంతో పోలీసులు వెంబడించి లారీని పట్టుకుని వివరాలు సేకరిస్తుండగా పంజాబ్‌కు చెందిన లారీ డ్రైవర్‌ గురుప్రీత్‌సింగ్‌ కర్రలతో దాడికి దిగాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ జీవన్‌ తలకు గాయాలయ్యాయి. దీంతో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సయ్యద్‌ అహ్మద్‌ తెలిపారు. (మీడియా మౌనం.. అసలు కిమ్‌కు ఏమైంది? )

సాక్షి, ఇందూరు(నిజామాబాద్‌ ‌): ఉద్యోగులు అవసరం లేకున్నా ఆన్‌ డ్యూటీ స్టిక్కర్లు వాహనాలపై వేసుకుని బయట తిరిగితే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ నారాయణ రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అధికారులకు సర్క్యూలర్‌ ద్వారా ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం నిర్ధేశించిన లాక్‌డౌన్‌ ఆదేశాలకు అనుగుణంగా కొన్ని శాఖల్లో రొటేషన్‌ ప్రకారం ఉద్యోగులను కార్యాలయాలకు విధులకు అనుమతించిందన్నారు. కానీ కొందరు ఉద్యోగులు విధుల్లో లేకున్నా కూడా వాహనాలకు ఆన్‌డ్యూటీ స్టిక్లర్లు అతికించుకుని అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారని, ఈ విషయా లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని, ఇ టువంటి ఉద్యోగులపై యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. (స్వీట్‌హార్ట్‌.. డిన్న‌ర్ ఎక్కడ  చేద్దాం' )

ఈ విధంగా ప్రవర్తించడం లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. అంతేకాక వైరస్‌ వ్యాప్తికి కారణం కావడంతో పాటు ఆ కుటుంబాల్లో వైరస్‌ వ్యాప్తి చెందడానికి అవకాశం కలుగుతుందని తద్వారా ఆ కు టుంబాలకు కూడా ప్రమాదకరమని తెలిపారు. అయితే అత్యవసర విధులు నిర్వహించే పో లీ సు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, అగి్నమాపక, తదితర శాఖల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి మాత్రమే కార్యాలయాల వేళలు త ర్వాత కూడా విధులకు హాజరు కావడానికి ప్రభుత్వ ఆదేశాలున్నాయన్నారు. కావునా ఆ యా కార్యాలయాలకు చెందిన సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. అదే విధంగా కొందరు అధికారుల కుటుంబ సభ్యులు, ప్రైవేట్‌ వ్యక్తులు కూడా ప్రభుత్వ వాహనాల్లో నిబంధనలకు విరుద్దంగా స్టిక్కర్లు అతికించుకుని బయట తిరుగుతున్నారని, అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుంటాయని కలెక్టర్‌ హెచ్చరించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఎవరు అతిక్రమించినా అధికారు లు, ఉద్యోగులు, సిబ్బందిపైన సీరియస్‌గా కఠనంగా చర్యలు తీసుకుంటామన్నారు. (‘పుష్ప’ సర్‌ప్రైజ్‌: బన్నీకి లవర్‌గా నివేదా )

ప్రజలు తిరిగే ప్రాంతాల్లో జాగ్రత్త.. 
కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రజలు వచ్చే అన్ని ప్రాంతాలతో పాటు రైతులు తీసుకొచ్చే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా వైరస్‌ నిరోధించడానికి అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధిహామీ ప నులు, వ్యవసాయ పనులు చేయడానికి కూలీ లు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు.బ్యాంకులు, కిరాణా దుకాణా లు, మాంసం దుకాణాల వద్ద జనం ఎక్కు ఉంటారని ఇక్కడ మరింత పటిష్టంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటు సంబంధిత యాజమాన్యాలు కూడా వారి ప్రాంతాలకు వచ్చే ప్రజలు క్రమ శిక్షణ, భౌతిక దూరం పాటించేలా చూసుకోవాలన్నారు. దుకా ణాల వద్ద శానిటైజర్‌లు ఏర్పాటు చేయాల న్నారు. ఈ జాగ్రత్త చర్యలు తీసుకోని వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. (ప్రారంభమైన కేంద్ర కేబినెట్‌ భేటీ )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top