'స్వీట్‌హార్ట్‌.. డిన్న‌ర్ ఎక్కడ  చేద్దాం'

Mohammad Kaif Birthday Wishes To Puja Kaif Through Twitter - Sakshi

ల‌క్నో : క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండ‌డంతో అంద‌రూ ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యార‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా  మిగ‌తా అన్ని కార్య‌క్ర‌మాలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.  అయితే సెల‌బ్రిటీల నుంచి సామాన్యుల దాకా  పుట్టిన రోజు వేడుక‌లు, ఇత‌ర‌త్రా శుభ‌కార్యాలు ఎవ‌రి ఇంట్లో వారే జ‌రుపుకుంటున్నారు. అయితే కొంద‌రు దానిని వినూత్నంగా జ‌రుపుకోవాల‌ని భావిస్తున్నారు.  తాజాగా ఈ లిస్ట్‌లో టీమిండియా మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్  చేరిపోయాడు. మంగ‌ళ‌వారం.. భార్య పూజా కైఫ్ పుట్టిన రోజు పుర‌స్క‌రించుకొని మ‌హ్మ‌ద్ కైఫ్ ట్విట‌ర్‌లో ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపాడు. 'నా జీవిత భాగ‌స్వామి పూజా కైఫ్‌కు ఇవే నా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. ఈరోజు డిన్న‌ర్ ఎక్క‌డ చేద్దాం స్వీట్‌హార్ట్.. త్వ‌ర‌గా చెప్పు నీ రిప్లై కోసం ఎదురుచూస్తుంటా' అంటూ పేర్కొన్నాడు. అయితే కైఫ్ భార్య పూజా నుంచి ఎటువంటి రిప్లై రాలేదు.('ఫామ్‌లోనే ఉన్నా అయినా ఎంపిక చేయలేదు')

అయితే కైఫ్ పెట్టిన పోస్టుపై నెటిజన్లు కామెంట్ల వ‌ర్షం కురిపించారు. ''బ‌య‌ట క‌రోనా ఉంది.. కాబ‌ట్టి ఇంట్లోనే డిన్న‌ర్ చేయండి... అదేంటి కైఫ్ అదేం ప్ర‌శ్న‌.. మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద చేయండి.. క‌రోనా పుణ్య‌మా అని మీకు అదృష్టం క‌లిసొచ్చింది.. హాయిగా మీ భార్య‌కు వండిపెట్టి సంతోషంగా తినేయండి'' అంటూ కామెంట్లు పెట్టారు. అంత‌కుముందు టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కైఫ్ భార్య‌కు శుభాకాంక్ష‌లు తెలిపాడు.'వ‌దిన.. మీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు'  అని ట్విట‌ర్‌లో తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top