అన్నపూర్ణ స్టూడియోకి నోటీసులు | legal notice to annapurna studios | Sakshi
Sakshi News home page

అన్నపూర్ణ స్టూడియోకి నోటీసులు

Mar 23 2015 5:43 PM | Updated on Sep 2 2017 11:16 PM

తీసుకున్న లోన్‌లు చెల్లించనందుకు రెండు బ్యాంకుల నుండి అన్నపూర్ణ స్టూడియోకి లీగల్ నోటీసులు అందాయి.

హైదరాబాద్ : తీసుకున్న లోన్‌లు చెల్లించనందుకు రెండు బ్యాంకుల నుంచి అన్నపూర్ణ స్టూడియోకి లీగల్ నోటీసులు అందాయి. వివరాల ప్రకారం... సినీనటుడు నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియో రెండు బ్యాంకులకు కలిపి దాదాపు రూ.62 కోట్లు బకాయి పడింది. ఆంధ్రా బ్యాంక్‌కు రూ.29.7 కోట్లు బాకీ పడగా, ఇండియన్ బ్యాంక్‌కు రూ.32.3 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు బ్యాంకుల అధికారులు సోమవారం అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యానికి లీగల్ నోటీసులు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement