గతేడాది 361 మంది హెపటైటిస్-బి మృతులు | Last year, 361 people dead Hepatitis-B | Sakshi
Sakshi News home page

గతేడాది 361 మంది హెపటైటిస్-బి మృతులు

Apr 25 2015 1:05 AM | Updated on Aug 10 2018 8:13 PM

గతేడాది 361 మంది హెపటైటిస్-బి మృతులు - Sakshi

గతేడాది 361 మంది హెపటైటిస్-బి మృతులు

దేశ వ్యాప్తంగా హెపటైటిస్-బి తో 2014లో 361 మంది మృత్యువాత పడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు.

లోక్‌సభలో ఎంపీ పొంగులేటి పశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా హెపటైటిస్-బి తో 2014లో 361 మంది మృత్యువాత పడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సమాచారం లేదన్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రబలుతున్న హెపటైటిస్-బి వ్యాధి అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు తెలపాలంటూ శుక్రవారం లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

ఆయనతోపాటు టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జేపీ నడ్డా శుక్రవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ వైరల్ హెపటైటిస్‌ను అరికట్టేందుకు ప్రణాళికలు రూపొం దించి అమలు చేస్తున్నామని, పలు జాతీయస్థాయి పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులను ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు, ప్రైవేటు కంపెనీల నుంచి అంతర్జాతీయంగా టెండర్లు నిర్వహించి సేకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి  నడ్డా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement