కరెంట్ షాక్‌తో ఉపాధి కూలీ మృతి | labour dies of vidyut shock in medak district | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్‌తో ఉపాధి కూలీ మృతి

Jun 13 2015 6:32 PM | Updated on Sep 3 2017 3:41 AM

కరెంటు షాక్‌తో ఓ ఉపాధి కూలీ మృతి చెందాడు.

కొండాపూర్ (మెదక్): కరెంటు షాక్‌తో ఓ ఉపాధి కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కొండాపూర్ మండలంలో శనివారం జరిగింది. మండలంలోని తొగర్‌పల్లి గ్రామానికి చెందిన సందగల్ల దయానంద్ (38) ఉపాధి పనిలో భాగంగా విద్యుత్ స్తంభం పక్కన గుంత తవ్వుతుండగా షాక్ తగిలింది. దీంతో తోటి కూలీలు దయానంద్‌ను ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. కాగా.. మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో ఏడీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement